ఎల్ఓసి అందజేత
బతుకమ్మ,బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రానికి చెందిన తెడ్డు ముత్యం కంటికి క్యాన్సర్ సోకి చికిత్స అవసరమై నిమ్స్ హాస్పిటల్ లో చేరడం జరిగింది. దీంతో స్థానిక నాయకులు స్థానిక ఎమ్మెల్యే మాజీమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకురాగా వారి చికిత్స కొరకు రూ.1,10,000 ఎల్ఓసి మంజూరు చేయించారు. సంబంధిత కాపీని శనివారం హైదరాబాద్ లోని నివాసంలో బాధితునికి అందజేశారు. ఈ సందర్భంగా ఎల్ఓసి మంజూరు చేయించిన ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలియజేశారు.