Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 April 2025, 8:30 pm Posted by : ramakrishna

ఎల్ఓసి అందజేత

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామానికి చెందిన పత్రి సంయుక్త  ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడి చికిత్స కొరకు హైదారాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో చేరారు. ఆమె తలకు ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. ఆపరేషన్ కు ప్రభుత్వం తరుపున సహాయం కొరకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అభ్యర్థించగా ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 2,50,000 ఎల్ఓసీ ని ఇప్పించడం జరిగింది. ఆపద సమయంలో ఆదుకున్న ముత్యాల సునీల్ కుమార్ కు వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.