Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 October 2025, 8:40 pm Posted by : ramakrishna

బాధిత మహిళకు ఎల్ఓసీ అందజేత

ఆర్మూర్, బతుకమ్మ : మండలంలోని దుర్గానగర్ కు చెందిన బల్లగిరి వెంకాయమ్మ అనే భాదిత మహిళకు ఆర్మూర్ కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి రూ. 250000 ల ఎల్ ఓ సీ ని మంగళవారం అందజేశారు. అనారోగ్యం పాలైన భాధితురాలికి శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు చెప్పగా శస్త్ర చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో చేర్చగా విషయాన్ని వినయ్ రెడ్డి దృష్టి కి స్థానిక నాయకులు తీసుకెళ్లారు. దాంతో స్పందించిన వినయ్ రెడ్డి సీ ఏం రిలీఫ్ ఫండ్ నుండి సర్జరీ నిమిత్తం రూ. 250000 ఎల్ ఓ సి శాంక్షన్ చేయించి కాపీని భాధిత కుటుంబకులకు అందజేశారు. ఎల్ ఓ సీ మంజూరు కు కృషి చేసిన వినయ్ రెడ్డి కి భాదిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.