Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 July 2025, 9:14 pm Posted by : ramakrishna

ఆర్ధిక, సామాజికాభివృద్ధికి రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

  • ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్

 

భీమ్ గల్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళాలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని కాంక్షిస్తూ ఇందిరా క్రాంతి పథం ద్వారా అందిస్తున్న బ్యాంకు ఋణలను సద్వినియోగం చేసుకోవాలని ఏంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ సూచించారు. సీ. ఏం రేవంత్ రెడ్డి ఆదేశానుసారం మండలంలోని ఐ కె పీ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలను మండల సమైక్య ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక మహిళా శక్తి సంబరాల్లో భాగంగా ప్రభుత్వం ఇస్తున్న మహిళా సంఘ బ్యాంక్ ఋణలు, శ్రీనిధి ఋణలు, వడ్డీ లేని ఋణలు, ఋణలు తీసుకొన్న మహిళా సంఘ సభ్యులకు భీమా సౌకర్యం, ప్రమాద భీమా, ఉచిత బస్సు సౌకర్యం, మహిళా శక్తి క్యాంటిన్లు, పెట్రోల్ బ్యాంకులు, ఇతర ఆధాయాభివృద్ధి ఋణల గురించి ప్రతి గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఏం రవీందర్, సీ సీ లు కుంట శ్రీనివాస్, పురస్తు నరేష్, గంగ సాయిలు, భాస్కర్, రఘుపతి, సుమలత, గంగ లలితా, గణేష్, ముత్యం, గ్రామ సంఘాల అధ్యక్షులు, వీఓఏ లు తదితరులు పాల్గొన్నారు.