Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 September 2025, 5:06 pm Posted by : ramakrishna

రైతులకు రుణాలు మంజూరు

బతుకమ్మ, కోటగిరి : కోటగిరి ప్రాథమిక సహకారం సంఘం ఆధ్వర్యంలో రైతులకు రుణాలు ఇవ్వడం జరిగిందని  చైర్మన్ కూచి సిద్దు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 2025 ఖరీఫ్ సీజన్ కు గాను పదకొండు మంది సభ్యులు 7,82,500 రూపాయలుని సహకారం సంఘం నుండి రుణాలుగా ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. రుణాలు తీసుకున్న సభ్యులు సకాలంలో రుణాలు చెల్లించి సంఘం అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం సిబ్బంది, సభ్యులు పాల్గొన్నారు.