. . . బినోల పీఏసీఎస్ మహాజన సభ తీర్మాణం
నవీపేట్, బతుకమ్మ :
రుణమాఫీ అర్హత గల రైతులందరికీ రుణమాఫీ విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ బినోల ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం తీర్మాణం చేసింది. బుధవారం నవీపేట్ మండలం బినోల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్రతమార్ధ వార్షిక 65వ మహాజన సభ సమావేశం సంఘ అధ్యక్షులు మగ్గరి హన్మండ్లు అధ్యక్షతన మహాజనసభ సమావేశాన్ని నిర్వహించారు. ఈ మహాజనసభ సమావేశంలో సంఘ కార్యదర్శి రమేష్ 2025-26 ఆర్థిక సంవత్సరం ఆడిట్ నివేదికను చదివి వినిపించారు. 1 ఏప్రిల్ 2026 నుంచి 25 సెప్టెంబర్ 2026 వరకు సంఘం నిర్వహించినటువంటి ఆర్థిక లావాదేవీలు జమలు, చెల్లింపులు, లాభనష్టాల ఖాతా, వ్యాపార ఖాతాలను చదివి వినిపించారు. తదనంతరం రాబోయే సీజన్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ విషయం, అలాగే సంఘంలో నిరంతరం సకాలంలో రుణాలు చెల్లిస్తున్నటువంటి రైతులకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా కల్పించినటువంటి వ్యక్తిగత ప్రమాద భీమా నష్ట పరిహారం రుణం మినహాయింపులకు సరిపోతున్నందున రైతును కోల్పోయిన కుటుంబానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండాలని ఉద్దేశంతో సంఘం తరఫున మరొక మూడు లక్షల రూపాయలకు వ్యక్తిగత ప్రమాద బీమా నష్టపరిహారాన్ని సంఘం ద్వారా కల్పిస్తూ తీర్మానించడం జరిగిందన్నారు. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం సహకార సంఘాలను నామినేటెడ్ చేయాలని చూస్తున్నాదో అది విరమించుకోవాలని బైలా ప్రకారం ఎలక్షన్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు మగ్గరి హన్మండ్లు, ఉపాధ్యక్షులు ఖాజా అసముద్దీన్, పాలక వర్గ సభ్యులు విజయ్ కుమార్, అంజా గౌడ్, ప్రదీప్ రావు, బాలచందర్ గౌడ్, సంఘ కార్యదర్శి రమేష్, సిబ్బంది, సంఘ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
