రుణమాఫీ కాని వారికి రుణమాఫీ చేయాలి
బతుకమ్మ, భిక్కనూరు: రుణమాఫీ కాని వారికి 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని రామేశ్వర్ పల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన సహకార సంఘం మహాజన సభలో చైర్మన్ భూమిరెడ్డి సభ్యుల సహకారంతో తీర్మానించినట్లు తెలిపారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ జరగలేదని అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలన్నారు. అనంతరం సొసైటీ కార్యాలయ జమా, ఖర్చుల వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, వీడీసీ అధ్యక్షులు సూర్యకాంత్ రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్, మాజీ వీడీసీ అధ్యక్షుడు...