Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 September 2024, 6:31 pm Posted by : ramakrishna

రూ.2లక్షల రుణమాఫీ వెంటనే చేయాలి

  • మహాజన సభలో ఏకగ్రీవ తీర్మానం

బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల సహకార కేంద్రం లో ఉన్న రైతులకు ఎలాంటి శత్రువులు లేకుండా రెండు లక్షల రుణమాఫీని చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. రాంపూర్,చిన్న కోడప్ గల్ మహాజన సభను సోమవారం నిర్వహించారు. సభలో రైతులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము రెండు లక్షల రుణమాఫీని సాంకేతిక లోపాలు లేకుండా త్వరగా మాఫీ చేయాలని తీర్మానం చేశారు. గత సంవత్సరం జరిగిన లావాదేవీల గురించి సీఈవో సంతోష్ రెడ్డి చదివి వినిపించారు. వచ్చే సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధ్యక్షుడు శపథం రెడ్డి అన్నారు. చిన్న కోడప్ గల్ సొసైటీ పరిధిలో గల రైతులు రోడ్లపై ధాన్యం పొయ్యరాదని సొసైటీ చూపించిన స్థలాలలో ధాన్యం ఆరబెట్టాలని చైర్మన్ రైతులను కోరారు.
రైతు రుణమాఫీ కాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు !
పిట్లం మండలంలోని చిన్న కొడపగల్, చిల్లర్గి,(రాంపూర్) కారేగాం సొసైటీలలో సోమవారం చైర్మన్ ల ఆధ్వర్యంలో, మహాజనసభ నిర్వహించారు. ఈ సభలలో రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన ప్రకారం రైతులకు రుణమాఫీ కాలేదని, రెండు లక్షల వరకు ఉన్న రుణమాఫీలు ఏకకాలంలో కాలేవని, కేవలం లక్ష రూపాయల రుణమాఫీ ఉన్న రైతులకు దాదాపుగా రుణమాఫీ వచ్చిందని, ఎందుకు రుణమాఫీ కావడం లేదని రైతులు సొసైటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బేషరతుగా 2 లక్షల వరకు రుణమాఫీ ఏకకాలంలో చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సొసైటీ సీఈవోలు సంఘం యొక్క జమ కర్చు వివరాలను రైతుల సమక్షంలో చదివి వినిపించారు. అనంతరం తీర్మానాలను చేశారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ కానీ రైతులకు ఏకకాలంలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని, అదేవిధంగా సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కానీ రైతులకు రుణమాఫీ కొరకు సిఫార్సు చేయుట గురించి, చిన్న కొడప గల్ లో నూతన భవనం నిర్మించినందున, పాత భవనంలోని సామానులు వేలం వేట గురించి తీర్మానాలు చేశారు .ఈ కార్యక్రమంలో చిల్లార్గి సొసైటీ చైర్మన్ శపథం రెడ్డి, సొసైటీ సీఈఓ సంతోష్ రెడ్డి, చిన్న కొడంగల్ సొసైటీ చైర్మన్ నాగిరెడ్డి, సీఈఓ హన్మాండ్లు,కారేగామ్ సొసైటీ చైర్మన్ వెంకటరెడ్డి, సీఈవో నరసింహారెడ్డి, ఆయా సొసైటీల డైరెక్టర్లు,రైతులు పాల్గొన్నారు.