రైతులందరికి ఋణ మాఫీ వెంటనే అమలు చెయ్యాలి

 బోధన్ నియోజకవర్గంలో బిఆర్ఎస్, బిజెపి ధర్నాలు బతుకమ్మ, బోధన్ : ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతన్నలకు ఇచ్చిన రూ. 2 లక్షల రైతు ఋణమాఫీని ఎలాంటి షరతులు, ఆంక్షలు లేకుండా వెంటనే సంపూర్ణ ఋణమాఫిని చెయ్యాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గంలో బోధన్ పట్టణం తో పాటుగా వివిధ మండలాల్లో బిఆర్ఎస్ శ్రేణులు, బిజెపి కార్యకర్తలు వేరువేరుగా ధర్నాలు నిర్వహించి తహశీల్దార్ కు వినతిపత్రాలు అందజేశారు. గురువారం బోధన్, నవీపేట్, తదితర మండల కేంద్రాల్లో బీయర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో షరతులు లేకుండా రైతులకు 2 లక్షల...