బేషరతుగా రుణమాఫీ చేయాలి

మాచారెడ్డి లో బీఆర్ఎస్ ఆందోళన బతుకమ్మ, మాచారెడ్డి: ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని మాచారెడ్డి మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆందోళన నిర్వహించింది. అధిష్టానం పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు పగడాల బాలచంద్రం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామి తోపాటు రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు 15 వరకు మాఫీ చేస్తామని మాట ఇచ్చి కేవలం 30 శాతం మంది...