రుణ పంపిణీ లక్ష్యాలను సాధించాలి

జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్  గైర్హాజరైన బ్యాంకర్ల తీరుపై అసహనం   నిజామబాద్, బతుకమ్మ : ఆయా రంగాలకు రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశం జరిగింది. ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి కేటాయించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతి, వచ్చే సీజన్...