Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 March 2026, 5:31 pm Posted by : ramakrishna

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

 

బోధన్, బతుకమ్మ :

 

బోధన్ మండలంలోని నాగన్‌పల్లి గ్రామంలో పశువులకు గాలికుంటు (ఎఫ్‌ఎండీ) వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. గ్రామంలోని పశువుల ఆరోగ్యాన్ని కాపాడడం లక్ష్యంగా ఈ టీకాల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వెటర్నరీ డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ పశువుల్లో గాలికుంటు వ్యాధి వ్యాపించకుండా ఉండేందుకు రైతులు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని సూచించారు. వ్యాధి సోకితే పశువుల పాల ఉత్పత్తి తగ్గిపోవడంతో పాటు రైతులకు ఆర్థిక నష్టం కలుగుతుందని తెలిపారు. అందువల్ల ప్రభుత్వ వెటర్నరీ శాఖ నిర్వహిస్తున్న టీకాల కార్యక్రమాలను రైతులు పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆయనన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మచుకురి వినోద్, బాలాజీ, మహేష్, సంజీవ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

 

Livestock vaccinations against rabies