. . . డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడమే అందరి లక్ష్యం
. . . బాన్సువాడ పట్టణ సీఐ తుల శ్రీధర్
బాన్సువాడ, బతుకమ్మ :
గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంకల్పంలో మనమందరం భాగస్వాములవుదామని బాన్సువాడ పట్టణ సిఐ తుల శ్రీధర్ అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి తాడ్కోల్ చౌరస్తా వరకు విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీ నిరహించారు. విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా తదనంతర పరిణామాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా పట్టణ సీఐ తుల శ్రీధర్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వినియోగం అనేది మానసికంగా ఆర్థికంగా నాశనం చేస్తుందని అన్నారు. దీంతో యువత చాలా మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. ఎక్కడైనా ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1908కు లేదా 8712671111కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అసద్, అధ్యాపకులు, ఎక్సైజ్ ఎస్సై, పోలీస్ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
