Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 March 2025, 7:32 pm Posted by : ramakrishna

వలలో చిక్కిన జీవితాలు

  • చేపల వేటలో మత్స్యకారుల మృతి
  • బాధిత కుటుంబాలు ఎక్స్ గ్రేషియా కోసం ఎదురుచూపులు

 

బతుకమ్మ,మోర్తాడ్: చేపల వేటనే ప్రధాన వృత్తిగా జీవనాధారంగా గడుపుతూ చేపల వేటకు వెళ్లి ఎన్నో కష్టాలు పడి మత్స్యకారులు తమ కుటుంబాలను పోషిస్తున్నారు. జీవనోపాధి కోసం శ్రీరాంసాగర్ జలాశయంలో, గ్రామాల్లోని చెరువుల్లో చేపల వేటాడుతున్న మత్స్యకారులు వేటకు ఉపయోగించే వలలకు చిక్కి బలవుతున్నారని తెలుపడంలో సందేహం లేదు. ప్రాజెక్టులో చేపల కోసం వేసిన కాండ్రీలు (వలలు) కాళ్లకు చుట్టుకొని నీట మునిగి మృత్యువాత పడుతున్నారు.

  • ఈ సంవత్సరం జరిగిన సంఘటనలు..

గత నెలలో బాల్కొండకు చెందిన బట్టు నారాయణ, ముప్కాల్ మండలం వేంపల్లికి చెందిన నడిపి రాజన్న ప్రమాదవశాత్తు మరణించారు. వారం వ్యవధిలో ఇద్దరు గంగపుత్రులు దుర్మరణం చెందడంతో మత్యకారులు చేపల వేటాడేందుకు జంకుతున్నారు. మంగళవారం భీమ్ గల్ మండలం సిద్ధపల్లి గ్రామస్తుడు తోపారం బొర్రన్న అనే మత్స్యకారుడు వలలో చిక్కి ప్రాణాలు కోల్పోయాడు.

  • నిజామాబాద్ జిల్లాలో..

నిజామాబాద్ జిల్లాలోని 530 గ్రామపంచాయతీలలో సుమారు 380 మత్స్యశాఖ సహకార సంఘాలు ఉన్నాయి. మత్స్యకారులు ప్రమాదవశాత్తు ఇప్పటి వరకు చనిపోయినట్లు 114 కేసులు నమోదు కాక ఇప్పటివరకు 6 ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చినట్లు అధికారుల లెక్కలు తెలుపుతున్నాయి. 105 అప్లికేషన్లు ప్రాసెసింగ్ లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. 17 అప్లికేషన్లు రిజెక్టెడ్ అయినాయి. హైదరాబాద్ హెడ్ ఆఫీస్ లో 7 అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి.

  • ఆపదమిత్ర ద్వారా శిక్షణ ఇస్తున్నాం
  • ఆంజనేయస్వామి, ఏ.డి మత్స్యశాఖ (నిజామాబాద్)

మత్స్యకారులు ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి ప్రమాదాల బారిన పడితే కాపాడుకోవడం కోసం ఆపదమిత్ర ద్వారా శిక్షణ ఇస్తున్నాం. మొదటి విడత పూర్తయింది. మరో రెండు వీడతల్లో శిక్షణ పూర్తి చేసి పూర్తిగా అవగాహన వారికి కల్పిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తుంది.