Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 July 2025, 2:30 pm Posted by : ramakrishna

మత్తు పదార్థాలు సేవిస్తే  జీవితాలు చిత్తు కాగితాలుగా మారతాయి

  • మెండోరా ఎస్సై సుహాసిని

 

మెండోరా, బతుకమ్మ:  మత్తు పదార్థాలు సేవిస్తే జీవితాలు చిత్తు కాగితాలుగా పనికిరాకుండా మారతాయని మెండోరా ఎస్సై సుహాసిని అన్నారు. మెండోరా మండలం, పోచంపాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో డ్రగ్స్, గంజాయి, కల్తీ కళ్ళు, మత్తు పదార్థాల గురించి  ఎస్సై ఆధ్వర్యంలో గురువారం పోచంపాడ్ గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి గ్రామస్తులకు మత్తు పదార్థాలు సేవిస్తే కలిగే నష్టాల గురించి తెలియజేశారు. యువత మత్తు పదార్థాలకి బానిస కావొద్దని, మత్తు పదార్థాలు సేవిస్తే జీవితాలు  పాడైపోతాయని తెలిపారు. తల్లితండ్రులు తమ పిల్లల పట్ల శ్రద్ధ వహించి వారిని చెడు అలవాట్లని లోనూ కాకుండా చూసుకోవాలని కోరారు. ఎవరైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు అమ్మిన, సేవించిన వారిపై చట్టరీత్య తగు చర్య తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.