Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 November 2025, 6:49 pm Posted by : ramakrishna

మత్తు తో జీవితాలు చిత్తుగా మారతాయి

మెండోరా, బతుకమ్మ: మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలు జీవితాలను నాశనం చేస్తాయని ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. యువత మారకద్రవ్యాలకు దూరంగా ఉండాలని లక్ష్యాన్ని ఏర్పరచుకొని జీవితంలో మంచి స్థానంలో స్థిరపడాలని ఆయన పేర్కొన్నారు. ప్రతిరోజు వ్యాయామం చేస్తూ, క్రీడలు ఆడటం వల్ల యువతకు మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలియజేశారు. మెండోరా పోలీస్ ఆధ్వర్యం లో పోలీసుల అమరవీరుల దినోత్సవం లో భాగంగా పోచంపాడ్ గ్రామం లో శనివారం వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది.  క్రీడల అనంతరం మంచి ప్రతిభ చూపించిన విజేతలకి బహుమతులతో సత్కరించడం జరిగింది. కార్యక్రమంలో ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, మెండోరా ఎస్ఐ సుహాసిని తదితరులు పాల్గొన్నారు.

Lives become messy with alcohol.