Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 December 2024, 5:22 pm Posted by : ramakrishna

ఇన్ స్పైర్ రాష్ట్రస్థాయి ప్రదర్శన కు లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ ప్రాజెక్ట్ ఎంపిక

బతుకమ్మ, నవీపేట్ : జిల్లాస్థాయి ఇన్ స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో నవీపేట్ కు చెందిన లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ విభాగంలో రాష్ట్రస్థాయికి ఎన్నికైందని పాఠశాల కరస్పాండెంట్ హన్మాండ్లు తెలిపారు. ఇన్ స్పైర్ మనక్ జిల్లా స్థాయి లో లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ కు చెందిన 4 ప్రాజెక్ట్ లకు అవార్డ్ లు రాగా శుక్ర, శనివారం  నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్.ఎఫ్.ఎస్. స్కూల్ లో నిర్వహించిన జిల్లా స్థాయి ఇన్ స్పైర్,  రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన 2024లో లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ కు చెందిన 10వ తరగతి విద్యార్థిని ఇందుప్రియ రూపొందించిన ప్రాజెక్టు రాష్ట్రస్థాయి ప్రదర్శన కు ఎన్నికైంది. రాష్ట్రస్థాయి ప్రదర్శన కు ఎన్నికైన విద్యార్థిని ఇందుప్రియ, గైడ్ టీచర్ శరత్ ను డీఈఓ అశోక్ నవీపేట్ మండల విద్యాధికారి సక్కి అశోక్, పిఆర్టియు మండల జనరల్ సెక్రటరీ శివకుమార్,  కరస్పాండెంట్ హన్మాండ్లు అభినందించారు.