భీమ్ గల్ ప్రాథమిక పాఠశాలలో అక్షరాభ్యాసం
భీమ్ గల్, బతుకమ్మ : పట్టణంలోని బోయి గల్లి ప్రాథమిక పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్య రమేష్ ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి డి. స్వామి హాజరై మాట్లాడుతూ అజ్ఞానాంధకారాన్ని తొలగించేది విద్యా మాత్రమేనని అట్టి విద్యను అభ్యసించి జీవితంలో వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. పాఠశాల ప్రధానో పాధ్యాయులు సత్య రమేష్ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తున్నందున విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగపరచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.ఉచిత...