Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 October 2024, 6:32 pm Posted by : ramakrishna

మున్సిపల్ కార్పొరేషన్ భవనం పై మద్యం సిట్టింగ్

  • గతంలో కమిషనర్ హెచ్చరించిన మళ్లీ అదే తంతు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మున్సిపల్ కార్పొరేషన్ భవనం అందులో పని చేసే కొందరు ఉద్యోగులకు మద్యం సేవించేందుకు అనువైన అడ్డగా మారుతుంది. కార్పొరేషన్ భవనం పై భాగంలో మద్యం బాటిళ్లు, స్టఫ్ ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. అయితే ఇదే సంవత్సరం మున్సిపల్ భవనంలోనే కొందరు మద్యం సేవించడాన్ని గుర్తించి కమిషనర్ రాత్రి వేళలో మున్సిపల్ కార్పొరేషన్ భవనంలో తనిఖీలు చేపట్టి మద్యం సేవించే ఉద్యోగులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని వారికి హెచ్చరించిన విషయం మర్చిపోకముందే, మళ్లీ ఇలాంటి ఘటన మూడవ అంతస్తు పై భాగంలో రెండు మద్యం బాటిళ్లు ’బతుకమ్మ‘ కెమెరాకు చిక్కాయి.

Liquor sitting on Municipal Corporation building

గతంలో స్వయంగా మున్సిపల్ కమిషనర్ హెచ్చరించిన ఉద్యోగుల్లో మాత్రం ఎలాంటి మార్పు కనబడడం లేదు. అసలు రాత్రి అయితే చాలు అందులో పని చేసే కొందరు ఉద్యోగులు మద్యం సేవించేందుకు అనువైన స్థలంగా మూడవ అంతస్తు పైభాగాన్ని ఎంచుకుంటున్నారు. గతంలో కమిషనర్ సీరియస్ గా హెచ్చరించిన వారి తీరులో మార్పు రాకపోవడం గమనార్హం.

Liquor sitting on Municipal Corporation building