సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు బంద్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: హోలీ వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా గురువారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు వైన్ షాపులను మూసివేయాలని సీపీ పోతరాజు సాయిచైతన్య ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం సాయంత్రం 6 నుంచి శనివారం ఉదయం 6గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేస్తారని తెలియడంతో మందుబాబులు పెద్ద మొత్తంలో మద్యం కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు.