దసరాకు రూ.40 కోట్ల మద్యం అమ్మకాలు
నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ వ్యాప్తంగా విజయ దశమి వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీ జయంతి కావడంతో మద్యం, మాంసం దుకాణాలు మూసి ఉంచారు. అయితే కొన్ని చోట్ల మాంసం విక్రయాలకు అనధికారికంగా సడలింపు ఇచ్చారు. ఇక పండగ వేళ నిజామాబాద్ జిల్లాలో లిక్కర్ సేల్స్ ఊపందుకున్నాయి. అక్టోబర్ 2న మద్యం షాపులు మూసి ఉంచడంతో ఒక రోజు ముందుగానే మద్యం ప్రియులు ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో గత వారం రోజుల్లోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.40 కోట్ల మేర మద్యం వ్యాపారం...