Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 October 2025, 7:43 pm Posted by : ramakrishna

దసరాకు రూ.40 కోట్ల మద్యం అమ్మకాలు

నిజామాబాద్, బతుకమ్మ :  తెలంగాణ వ్యాప్తంగా విజయ దశమి వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీ జయంతి కావడంతో మద్యం, మాంసం దుకాణాలు మూసి ఉంచారు. అయితే కొన్ని చోట్ల మాంసం విక్రయాలకు అనధికారికంగా సడలింపు ఇచ్చారు. ఇక పండగ వేళ నిజామాబాద్ జిల్లాలో లిక్కర్ సేల్స్ ఊపందుకున్నాయి. అక్టోబర్ 2న మద్యం షాపులు మూసి ఉంచడంతో ఒక రోజు ముందుగానే మద్యం ప్రియులు ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో గత వారం రోజుల్లోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.40 కోట్ల మేర మద్యం వ్యాపారం జరిగినట్లు అంచనా. అయితే సాధారణ రోజుల్లో కంటే సేల్స్ ఎక్కువైనట్లు వ్యాపారులు చెప్తున్నారు. ఈ సారి దసరా గాంధీ జయంతి ఒకే రోజు రావడం లిక్కర్ షాప్ లు బంద్ కావడంతో ఒకరోజు ముందు ఎక్కువ మొత్తంలో మద్యం కొనుగోళ్లు జరిగాయి. దీంతో వైన్స్ షాప్ లు కొనుగోలు దారులతో కిక్కిరిశాయి.