బోధన్‌లో లయన్స్ క్లబ్ జనరల్ హాస్పిటల్ ప్రారంభం
బోధన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ జనరల్ హాస్పిటల్‌ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ శాసనసభ్యులు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ ఆసుపత్రి ద్వారా బోధన్ పట్టణ ప్రజలకు, ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ చారిటబుల్ ట్రస్ట్ చేపడుతున్న ప్రజాసేవా కార్యక్రమాలు...