Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 July 2025, 7:16 pm Posted by : ramakrishna

పేద విద్యార్థికి లయన్స్ చేయుత

 

 పిట్లం, బతుకమ్మ :         

పిట్లం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, దుండిగల్ లో CSE(AIML) మూడవ సంవత్సరం చదువుతున్న వైష్ణవికి హాస్టల్ ఫీజ్ కొరకు రూ. 1,20,000చెక్ అందించడం జరిగింది, ఈ సందర్బంగా రీజియన్ చైర్మన్ లయన్ అనిత రెడ్డి మాట్లాడుతు వైష్ణవిని పిట్లం లయన్స్ క్లబ్ దత్తత తీసుకుని ఆర్మూర్ క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజీ లో పాలిటెక్నిక్ చదివించామని,అనంతరం బీటెక్ కన్వీనర్ కోటాలో సీట్ సాధించడంతో  ఈ మూడు సంవత్సరాలు హాస్టల్ ఫీజ్ పిట్లం క్లబ్ సభ్యుల సహకారం తో చెల్లిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం లో డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ సంజీవ్ రెడ్డి, రీజియన్ కో ఆర్డినేటర్ లయన్ వేణుగోపాల్, పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ రజని, క్లబ్ కార్యదర్శి బాలు, కోశాధికారి మారుతి రెడ్డి పాల్గొన్నారు.