ఏసీబీకి చిక్కిన లింగపేట్ ఎస్సై

లింగంపేట్, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా లింగపేట ఎస్సై అరుణ్, రైటర్ రామస్వామి ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. గురువారం పోలీస్ స్టేషన్ లోనే లంచం తీసుకుంటుండగా నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఇన్ స్పెక్టర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గత వారం నిజామాబాద్ జిల్లా వర్ని ఎస్సై క్రిష్ణ కుమార్ స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయం తెలిసిందే.