Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 November 2024, 8:28 pm Posted by : ramakrishna

ఏసీబీ వలలో లింగంపేట్ ఎస్ఐ 

  • ఎస్సై తరుపును డబ్బులు తీసుకుంటు పట్టుబడిన స్టేషన్ రైటర్లింగంపేట్, బతుకమ్మ: స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు లంచం తీసుకుంటు లింగంపేట్ ఎస్ఐ, రైటర్లు అవినితి నిరోధకశాఖకు చిక్కారు. కామారెడ్డి జల్లా లింగంపేట్ ఎస్ఐ పబ్బ అరుణ్, కానిస్టేబుల్ ( రైటర్ ) తోట రామాస్వామీ లు రూ. 10 వేలు లంచం తీసుకుంటుండంగా లింగంపేట్ పోలీస్ స్టేషన్ లో నిజామాబాద్ రేంజ్ ఏసీబీ డిఎస్పీశేఖర్ గౌడ్ అధ్వర్యంలో రెడ్ హ్యాండేడ్ గా గురువారం పట్టుకున్నారు.  లింగంపేట్ మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన మీసేవా నిర్వాహకుడు శివ లింగం గౌడ్ నుంచి రూ.10 వేలు లంచం తీసుకున్న స్టేషన్ రైటర్ రామాస్వామీని పట్టుకుని విచారించగా.. ఎస్ఐ అరుణ్ ఆదేశాల మేరకు డబ్బులు తీసుకున్నట్టు ఏసీబీ డిఎస్పీ తెలిపారు. ఇటీవల కాలంలో అతడిని లింగంపేట్ ఎస్ఐ అరుణ్  తహసీల్థార్ ముందు బైండోవర్ చేశారు. కొన్ని రోజుల క్రితం శివలింగం గౌడ్ ఒక వ్యక్తిపై బీరు సీసాతో దాడి చేశాడు. సంబందిత కేసులో ఇదివరకే స్టేషన్ బేయిల్ కోసం డబ్బులు తీసుకున్నట్టు తెలిసింది. మళ్లీ రూ.10 వేలు ఇస్తేనే బేయిల్ ఇస్తానని చెప్పడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీఅధికారుల సూచన మేరకు శివలింగం గౌడ్ లంచం ఇస్తుండగా ఎస్ఐ అరుణ్, కానిస్టేబుల్ రామాస్వామీలను పట్టుకుని నాంపల్లిలోని ఏసీబీ కోర్టు( ప్రత్యేక) న్యాయస్థానం ముందు హజరుపరుస్తామని డిఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు.
  • Lingampet SI in ACB net