Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 June 2025, 5:58 pm Posted by : ramakrishna

భూభారతి పైలట్ ప్రాజెక్ట్ గా లింగంపేట మండలం

  • ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్

 

లింగంపేట, బతుకమ్మ :  లింగంపేట మండల ప్రజలు  రైతులు భు సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం గ్రహించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటితో మాట్లాడి భూభారతి పైలట్ ప్రాజెక్ట్ గా లింగంపేట మండలం ఎంపిక చేసాం అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం, లింగంపేట  మండలం, 20 లక్షల నిధులతో నిర్మించిన బయ్యంపల్లి గ్రామ నూతన గ్రామ పంచాయితీ భవన ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడారు. గత 10 సంవత్సరాలుగా ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లు కూడా నిర్మించలేదని, కాని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల్లో మన నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు మంజూరైన విషయం గుర్తు చేశారు. కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనుల కొరకు రూ.23 కోట్ల నిధులు మంజూరయ్యాయని, నూతన రిజర్వాయర్ల నిర్మాణానికి అవసరమైన నిధులు విడుదల కోసం ప్రభుత్వ అధికారులతో, మంత్రితో చర్చలు జరిపినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో రూ.50 కోట్ల నిధులతో నూతన సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయిందని వివరించారు. వచ్చే రోజుల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి మరిన్ని నిధులు మంజూరు చేసి అభివృద్ధి జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Lingampet Mandal as Bhubharati Pilot Project1965