Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 November 2025, 7:48 pm Posted by : ramakrishna

పీసీసీ చీఫ్ ను సన్మానించిన లింబాద్రి గుట్ట ఆలయ అర్చకులు

హైదరాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలోని  భీంగల్ మండలం లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో టూరిజం గెస్ట్ హౌస్ నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరు చేయించేందుకు కృషి చేసిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ను గాంధీ భవన్లో ఆలయ అర్చకులు పార్థసారథి, గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించారు.  లింబాద్రిగుట్ట అభివృద్ధికి రూ.4 కోట్లు ఆమోదం పొందడంలో మహేష్ కుమార్ గౌడ్ పాత్ర కీలకమని గ్రామస్థులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించేందుకు టూరిజం గెస్ట్ హౌస్ ఎంతో ఉపయుక్తంగా ఉండబోతోందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..లింబాద్రి గుట్ట పవిత్రక్షేత్రంగా ప్రాచీనత, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన ప్రదేశమైందని, భక్తులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించేలా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు.

Limbadri Gutta priests honour PCC chief