.. ప్రాజెక్ట్ 14 గేట్ల ఎత్తివేత
. . . ఎస్సారెస్పీ లోకి 0.2 టీఎంసీల నీరు రాక
నిజామాబాద్, బతుకమ్మ:
మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు బుధవారం తెరిచారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూలై 1వ తేదీన బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ సమీపంలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు మహారాష్ట్ర, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు, కేంద్ర జల వనరుల శాఖ అధికారుల సమక్షంలో గేట్లు ఎత్తారు. గేట్లు అక్టోబర్ 28 వరకు తెరిచి ఉంచాలని సుప్రీం ఆదేశాలు ఉన్నాయి. ఈ క్రమంలో 30వ తేదీన ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ఇరు రాష్ట్రాల అధికారులు అర్ధరాత్రి దాటిన తర్వాత గేట్లు తెరిచారు. దీంతో దిగువకు 0.2 టీఎంసీల నీరు ఎస్సారెస్పీ వైపు వస్తోంది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ వాటర్ కమిషన్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చరణ్, జూనియర్ ఇంజినీర్లు సాయి ప్రణీత్, ప్రకాష్, మహారాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు బన్సోద్, ఓట్దార్, గవాయి, ఎస్సారెస్పీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కొత్త రవి, శ్యామ్ కుమార్, విన్యాస్ రెడ్డి పాల్గొన్నారు.