జీజీహెచ్ లో మొరాయించిన లిఫ్ట్

అరగంటపాటు ఇబ్బందులు పడ్డ రోగులు అప్రమత్తమై లిఫ్టు తెరిచిన సిబ్బంది నిజామాబాద్ సిటీ, బతుకమ్మ  :  నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జిల్లా జనరల్ ఆస్పత్రిలో లిఫ్ట్ మొరాయించింది. బుధవారం ఉదయం ఆసుపత్రి లో పై అంతస్తుల నుంచి రోగులు వారి బంధువులు లిఫ్ట్ లో కిందికి వస్తుండగా అర్ధాంతరంగా నిలిచిపోయింది. దాదాపు 15 మంది లిఫ్ట్ లో ఉండడం, అది మధ్యలో ఆగిపోవడంతో వారు ఆందోళనకు గురయ్యారు. ఆస్పత్రిలో సెక్యూరిటీ, లిఫ్ట్  విభాగాలను పర్యవేక్షించాల్సిన సిబ్బంది లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది....