Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 June 2025, 12:25 pm Posted by : ramakrishna

డ్రగ్స్ అలవాటుతో జీవితం అదోగతి

 

. . . మత్తుమందు మనుషుల మనుగడకు ముప్పు

. . . యువత నైపుణ్యత వైపు నడువు

. . . జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం ,అక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవం సందర్బంగా జిల్లాకోర్టు ప్రాంగణంలో ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ పచ్చజెండా చూపి ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జి. వి. ఎన్ భారత లక్ష్మీ  మాట్లాడుతు…డ్రగ్స్ అలవాటు మానవ జీవితాలను అతలాకుతలం చేసి అంతం దిశగా తీసుకువెళుతుందని తెలిపారు.జీవితాలు భద్రతమైన భవిష్యత్ వైపా…?. అదోగతి వైపా…? మానుష సమాజం తేల్చుకోవలసిన పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయని అన్నారు.మత్తుమందులతో మానవ మనుగడకు ముప్పు పొంచి ఉన్నదని దానిని దరి చేరనీయరాదని తెలిపారు. భారతవనికి యువత అతిపెద్ద వనరులని, చదువు, అధ్యయనంలో నైపుణ్యతలు సంపాదించి దేశ సహజ వనరులను వెలికితీసి, దేశ ఆర్థిక బలోపేతానికి బలంగా తయారు కావాలని జిల్లాజడ్జి భారత లక్ష్మీ ఆకాంక్షించారు.యువత, విద్యార్థులు డ్రగ్స్ అలవాట్లకు దూరంగా ఉండాలని తల్లితండ్రులు తమపై పెంచుకున్న ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా భవిష్యత్ కు ఆర్థిక భద్రతను నిర్మించుకోవాలని కోరారు. సమాజం పట్ల సామాజిక బాధ్యతగా జాతీయ న్యాయసేవ ప్రాధికార సంస్థ పౌరసమాజానికి న్యాయ సమాచార వెల్లువను న్యాయవిజ్ఞాన సదస్సుల ద్వారా వెదజల్లుతున్నదని ఆమె వివరించారు.బ చట్టాల పరమార్థం ప్రజలకు చేరవేయడానికి ఎనలేని కృషిని న్యాయసేవ సంస్థ చేస్తున్నదని జడ్జి భారత లక్ష్మీ తెలిపారు.

Life is a mess with drug addiction.

జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ ఉద్దేశం ప్రజలను చైతన్యవంతులను చేయడమేనని తెలిపారు. కార్యక్రమంలో అదనపు జిల్లాజడ్జిలు హరీష, ఆశాలత,జూనియర్ సివిల్ జడ్జిలు కుష్బూ ఉపాధ్యాయ్, గోపికృష్ణ, వడ్డి హరి కుమార్, శ్రీనివాస్ రావు, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేధార్,ఉదయ్ కృష్ణ,ఆశ నారాయణ,రెంజర్ల సురేష్, భాస్కర్ రెడ్డి,శ్రీమాన్,న్యాయసిబ్బంది, కక్షిదారులు, పారా లీగల్ వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు