Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 8:24 pm Posted by : ramakrishna

హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు…

 

. . . ఆస్తి, భూ వివాదాలే హత్యకు కారణం

 

. . . పటిష్ట సాక్ష్యాలతో రుజువైన నేరం

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

పదేళ్లుగా కొనసాగుతున్న ఆస్తి, భూ వివాదాలు చివరకు దారుణ హత్యకు దారితీశాయి. ఈ కేసులో ఇద్దరు నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున జరిమానా కూడా విధించింది. బీర్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ హత్య కేసులో పోలీసులు సమర్థవంతంగా దర్యాప్తు చేపట్టారు. సాక్షుల వాంగ్మూలాలు, శాస్త్రీయ ఆధారాలు, పక్కా సాక్ష్యాధారాలను సేకరించి నిందితులపై నేరాన్ని రుజువు చేసేలా దర్యాప్తు పూర్తి చేశారు. పోలీసుల సమర్థవంతమైన దర్యాప్తు ఫలితంగానే ఇద్దరు నిందితులకు కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది.కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి,పటిష్టమైన సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించి నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన దర్యాప్తు బృందాన్ని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ అభినందించారు.జిల్లాలో నేరాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఎస్పీ స్పష్టం చేశారు. సమర్థవంతమైన దర్యాప్తు, పటిష్టమైన సాక్ష్యాధారాలతో నేరస్తులకు శిక్ష పడేలా కామారెడ్డి పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.