నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
ఒక మహిళపై అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో వ్యక్తికి జీవిత కారాగార శిక్ష తో పాటు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్ స్పెషల్ సెషన్స్ జడ్జి (ఫర్ ఫాస్ట్ ట్రాకింగ్ ద కేసెస్ ఎగనెస్ట్ ఉమెన్) టి.శ్రీనివాస్ తీర్పు చెప్పారు. వివరాలు వర్ని మండలంలోని రాజీపేట్ తాండకు చెందిన వెంకట్ రావు ట్రాక్టర్ గా పని చేస్తుండేవాడు. ఫిబ్రవరి 23, 2019న వర్ని కల్లు దుకాణంలో కల్లు సేవించడానికి వెళ్లగా అక్కడ ఒక మహిళతో పరిచయం అయింది. వీరిద్దరు కలిసి కల్లు సేవించారు.అనంతరం మద్యం కొనుగోలు చేసి జాకోరా గ్రామం దగ్గర ఆటో దిగి రాజీపేట్ తాండాకు వెళ్లే దారిలో గూండ్ల వాగులో సేవించారు. అనంతరం ఇద్దరు శారీరకంగా కలిశారు. కొద్ది సేపటికి మళ్ళీ శారీరకంగా కలుద్దామని వెంకట్ రావు బలవంతం చేశాడు. ఆమె డబ్బులు ఇస్తేనే శారీరకంగా కలుద్దామని అనడంతో తాగిన మత్తులో ఉన్న అతను రెండు చేతులతో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. కోర్టు నేర న్యాయ విచారణలో నిర్థారణ అయింది. ఐపీసీ 302 హత్య నేరానికిగాను జీవిత కారాగార శిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా విధించారు. సెక్షన్ 376 అత్యాచారం నేరంకుగాను పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు వేయి రూపాయలు జరిమానా విధించారు. జరిమానాలు చెల్లించని యేడల అదనంగా రెండు నెలల జైలుశిక్ష అనుభవించాలని స్పెషల్ సేషన్స్ జడ్జి శ్రీనివాస్ తమ తీర్పులో పేర్కొన్నారు. వర్నిపోలీసుల తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంటు వసంత్ ప్రాసిక్యూషన్ నిర్వహించారు.