Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 September 2024, 3:28 pm Posted by : ramakrishna

రిటైర్డ్ పోలీసును హత్య చేసిన వ్యక్తికి జీవితఖైదు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

చిన్న భూవివాదంలో రిటైర్డ్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ను హత్యచేసిన కేసు రుజువు కావడంతో బోని చెట్టి గంగమల్లు కు జీవిత కారాగార శిక్ష విధిస్తు నిజామాబాద్ సెషన్స్ జడ్జి సునీత కుంచాల బుధవారం తీర్పు వెలువరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాదస్తు రాజారెడ్డి తెలిపిన వివరాలు.. నిజామాబాద్ రూరల్ మండలంలోని ఖానాపూర్ గ్రామంలోని రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ కొక్కొండ రామ్ ప్రసాద్,బోనిచెట్టి గంగమల్లు ల ఇల్లు ఎదురెదురుగా ఉంటాయి. రెండు ఇళ్ల మధ్య ఎనిమిది పీట్ల రోడ్డు ఉంటుంది. గంగమల్లు కు చెందిన మేకలు, గొర్రెలు ఆ దారి నుండి రాకపోకలు సాగిస్తుండేవి. రామ్ ప్రసాద్ కుటుంబీకులు ఇంటి ముందు తమ మోటారు వాహనాలను నిలుపుతుండేవారు. రోడ్డు చిన్నగా ఉండి మేకలు,గొర్రెలు, వాహనాల నిలుపుదల మూలంగా ఇద్దరి మద్య తరచుగా గొడవలు జరిగేవి. ఈ విషయం దీర్ఘకాలిక శత్రుత్వంగా మారిపోయింది. 25 ఫిబ్రవరి 2022 న చుట్టాల పెళ్లికి వెళ్లిన రామ్ ప్రసాద్ తిరిగి సాయంత్రం ఇంటికి బైక్ పైన చేరుకునే సమయంలో ఖానాపూర్ గ్రామ బైపాస్ రోడ్డు దగ్గర ఎదురుపడ్డ గంగమల్లు మధ్య తిరిగి మాటమాట పెరిగింది. రామ్ ప్రసాద్ ను చంపివేస్తే శాశ్వత పరిష్కారం దొరుకుతుందని భావించిన గంగమల్లు తన కొట్టేంలోని కట్టే తీసుకువచ్చి బైక్ పైన ఉన్న అతని తలపై బలంగా కొట్టాడు. కింద పడిన వీడకుండా మళ్ళి కట్టెతో పలుమార్లు కొట్టడంతో తల పగిలి మెదడు బయటికి వచ్చి రాం ప్రసాద్ అక్కడికక్కడే మరణించాడని నిజామాబాద్ సౌత్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జగడం నరేష్ నేర విచారణ పూర్తి చేసి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. అభియోగ పత్రం ఆధారంగా నేర  న్యాయ విచారణ చేసి సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసిన సెషన్స్ కోర్టు, ఇతర వస్తుగత సాక్ష్యాలను దృవీకరించుకుని గంగమల్లు ఉద్దేశపూర్వకంగా రామ్ ప్రసాద్ ను హత్య చేసినట్లు రుజువైనట్లు ప్రకటిస్తూ జీవిత కారాగార శిక్ష తో పాటు రెండు వేల రూపాయల జరిమాన విధిస్తు సెషన్స్ జడ్జి సునీత తీర్పు చెప్పారు. జరిమానా కట్టని ఎడల అదనంగా ఆరు నెలల జైలుశిక్ష అనుభవించాలని తమ తీర్పులో పేర్కొన్నారు