Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 July 2025, 5:01 pm Posted by : ramakrishna

ఎరువులకు లింకులు అంటగడితే లైసెన్సులు రద్దు చేస్తాం

 

. . . పర్టిలైజర్ డీలర్ లకు వార్నింగ్

.. జిల్లా వ్యవసాయ అధికారి  గోవింద్  

 కోటగిరి. బతుకమ్మ :

అనవసరంగా రైతులకు ఎరువులతో పాటు లింకులు అంటగట్టే ప్రయత్నం చేస్తే  లైసెన్స్లను రద్దు చేస్తామని  జిల్లా వ్యవసాయ అధికారి  గోవింద్ హెచ్చరించారు. మంగళవారం డిఎఓ కోటగిరి పొతంగల్ మండలంలోని ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్లను  పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఫర్టిలైజర్ షాప్ ల యజమానులు రైతులకు అవసరమేరా  ఎరువులను మాత్రమే  ఇవ్వాలని అనవసరంగా  లింకులను అంటగట్టొద్దని సూచించారు. జిల్లా వ్యాప్తిగా  యూరియా అందుబాటులో ఉందని రైతులెవ్వరు ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు. ఎవరైనా ప్రైవేట్ డీలర్స్ కావాలని కృత్రిమ కొరత సృష్టించిన  ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువ అమ్మిన  కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన  హెచ్చరించారు. ఆయన వెంట  కోటగిరి, పోతంగల్ మండలాల వ్యవసాయ అధికారులు,ఏఈఓ తదితరులు ఉన్నారు.

 

Licenses will be revoked if links are found to fertilizers.