ఫర్టిలైజర్ డీలర్ల లైసెన్స్ అప్డేషన్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నిజామాబాద్ ఏరియా ఆఫీస్ ఆధ్వర్యంలో ఫర్టిలైజర్స్ డీలర్ల లైసెన్స్ ల అప్డేషన్ క్యాంప్ ను నిర్మల్ లో నిర్వహించారు. నిర్మల్ రైతు వేదిక ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమానికి నిర్మల్ అర్బన్ ఏవో వినోద్, కంపెనీ మార్కెటింగ్ ఆఫీసర్స్ సునీల్ కుమార్, శివ కృష్ణ, సుమంత్ కుమార్, అధికారులు, డీలర్లు పాల్గొన్నారు.