జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రంథాలయం ఏర్పాటు
బతుకమ్మ,వేల్పూర్: మండలంలోని పచ్చలనడ్కుడా గ్రామంలో నూతన కాళోజి గ్రంథాలయం ప్రారంబించారు. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, జేడీ ఫౌండేషన్ చైర్మన్ వి.వి. లక్ష్మీనారాయణ సౌజన్యంతో ఈ గ్రంథాలయం స్థాపించారు. ఈ సందర్బంగా వక్తలు ఉపన్యసిస్తూ యువత ఈ గ్రంధాలయం ఉపయోగించుకొని వివిధ విషయాలపై అవగాహన పెంచుకోవాలని, గ్రామస్థుల అందరి సహకారంతో గ్రంధాలయం నడుపుకోవాలని చెబుతూ, జే.డి. ఫౌండేషన్ వారి ఉన్నత ఆశయాన్ని కొనియాడారు. గ్రామస్తులు మాట్లాడుతూ జే.డి. ఫౌండేషన్ కి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి సుంకెట, జిల్లా...