Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 3:46 pm Posted by : ramakrishna

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు

 

. . . నగర మేయర్  కూరగాయల ఉమారాణి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని నగర మేయర్  కూరగాయల ఉమారాణి అన్నారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమారాణి రమేష్  ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నేటి యువత, విద్యార్థులు సెల్‌ఫోన్లకు పరిమితం కాకుండా గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని పిలుపునిచ్చారు. పుస్తక పఠనం ద్వారా మానసిక వికాసంతో పాటు పోటీ పరీక్షల్లో విజయం సాధించడం సులభమవుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అంతరెడ్డి రాజారెడ్డి, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శ్రీలత, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు, పుస్తక ప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Libraries are storehouses of knowledge.