గ్రంథాలయాలు దేవాలయాలతో సమానం
నిజామాబాద్ సిటీ, బతకమ్మ: గ్రంథాలయాలు దేవాలయాలతో సమానమని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజిరెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాలొగన్న సుదర్శన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోటీ పరీక్షల కోసం గ్రంథాలయాల్లో సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఉన్నత స్థానాల్లో స్థిరపడుతున్నారన్నారు. గత ప్రభుత్వం గ్రంథాలయాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంలో విఫలమైందని, గ్రంథాలయాల ప్రతిష్టను దెబ్బతీసిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత గ్రంథాలయాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు...