Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 December 2024, 6:23 pm Posted by : ramakrishna

ధరణి నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి

సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి

బతుకమ్మ, వేల్పూర్ : ధరణి అనే దరిద్రం నుండి తెలంగాణ ప్రజలు విముక్తి పొందారని సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. రైతులు ధరణి పోర్టల్ తో చాలా ఇబ్బంది పడ్డారన్నారు. భూములు వున్నా పాస్ బుక్ లు రాక పరేషాన్ అయ్యారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి ని బంగాళా ఖాతంలో వేస్తామని చెప్పాము.చెప్పిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో భూ భారతి తీసుకొచ్చిందని తెలిపారు. ఏడాది కాలంగా రైతులతో మేధావులతో  రెవెన్యూ అధికారులతో చర్చించి భూ భారతిని తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.ఈ రోజు అసెంబ్లీ కొత్త ఆర్ వో ఆర్ చట్టం ప్రవేశ పెట్టినందుకు సంతోషంగా వుందన్నారు.