సాయుధ పోరాటం ఫలితంగా తెలంగాణకు విముక్తి
కామారెడ్డి, బతుకమ్మ: తెలంగాణ సాయుధ పోరాటం ఫలితంగా అప్పటి వరకు పల్లెల్లో నెలకొన్న వెట్టి చాకిరి, భావవ్యక్తీకరణ పై ఆంక్షలు, మాతృభాషా అణిచివేత, మతపరమైన నిరంకుశ ధోరణులు తొలగి 17 సెప్టెంబర్ 1948న హైదరాబాద్ సంస్థానం రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారిందని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నివాళులు...