Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 September 2024, 12:29 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విమోచన దినోత్సవ వేడుకలు

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ :     

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు,రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ చైర్మన్ అనిల్ ఈరవత్రి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్, విత్తనాభివ్రుద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ విమోచనంలో అప్పడి మంత్రివర్గం నెహ్రూ  నాయకత్వంలో సమన్వయంగా నిర్ణయం తీసుకొని తెలంగాణను విలీనం చేయడం జరిగిందన్నారు.ఇది ఏ ఒక్కరికి సంబంధించిన నిర్ణయం కాదని తెలంగాణ తొలి, మలి ఉద్యమాలలో ఎంతో మంది వీరులు  అమరులు అయినారని, వారికి తెలంగాణ విమోచన ఉద్యమంలో రజాకార్లకు ఎదురుగా పోరాడి ఎంతోమంది వీరులు ప్రాణాలు అర్పించారని వారందరికీ ఈ సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా విమోచన దినోత్సవం లోగాని ఎలాంటి పాత్రలేని బిజెపి నాయకులు ప్రస్తుతం అది కేవలం పటేల్ వల్లనే అని ఆయన బిజెపి నాయకుడు అని చెప్పుకుంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి జరిగే విధంగా అందరూ సమానమని విధంగా పరిపాలన జరుగుతుందని ప్రజాపాలన ప్రజల శ్రేయస్సు కోరికే జరుగుతుందని మానాల మోహన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో అంతిరెడ్డి రాజారెడ్డి,ముప్పగంగారెడ్డి,రత్నాకర్, రాంభూపాల్, వేణు రాజ్,రోహిత్, బొబ్బిలి రామకృష్ణ,నరేందర్ గౌడ్, విపుల్ గౌడ్ పాల్గొన్నారు.