Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 April 2025, 9:01 pm Posted by : ramakrishna

సిఫారసు లేఖలను ఆన్ లైన్ చేసి పంపించాలి

  • తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ లేఖ

 

హైదరాబాద్, బతుకమ్మ : శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఇచ్చే సిఫారసు లేఖలను కంప్యూటర్ అప్లికేషన్ రూపొందించి పోర్టల్ ద్వారా పంపాలని టిటీడీ సూచించింది. పోర్టల్ లో ఉన్న వివరాల ప్రకారమే భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనం, రూ.300 ప్రత్యేక దర్శనాలు తిరుమలలో ఇవ్వబడుతాయని తెలిపింది. పోర్టల్ లో లేని లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం వారు అంగీకరించరని తెలిపింది. తిరుమలకు ఇచ్చే సిఫారసు లేఖలన్నీ ఈ కంప్యూటర్ పోర్టల్ ద్వరానే తయారు చేసి, సంతకం చేసిన తర్వాత స్కాన్ చేసిన లేఖను అప్లోడ్ చేసి, అసలు లేఖను భక్తులకు ఇవ్వాలని సూచించింది.