బాపూజీ వచనాలయ భూములను కాపాడాలని సీఎంకు లేఖ

నిజామాబాద్, బతుకమ్మ: నగరంలోని బాపూజీ వచనాలయ భూములను కాపాడాలని బాపూజీ వచానాలయ పరిరక్షణ సమితి సభ్యులు కోనేరు సాయికుమార్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో బాపూజీ వచనాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యలో ఆదివారం విలేకరలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాపూజీ వచనాలయ భూములు పది ఎకరాల స్థలంలో సాయిరెడ్డి పెట్రోల్ పంపు, పియల్ఎంయస్ పెట్రోల్ బంకు, కొన్ని దుకాణాలు కిరాయికి ఇవ్వబడ్డాయని తెలిపారు. నిజామాబాద్ పట్టణం పెరగడంతో జిల్లా కేంద్రం నడిఒడ్డున ఉన్న...