Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 January 2025, 4:57 pm Posted by : ramakrishna

బాపూజీ వచనాలయ భూములను కాపాడాలని సీఎంకు లేఖ

నిజామాబాద్, బతుకమ్మ: నగరంలోని బాపూజీ వచనాలయ భూములను కాపాడాలని బాపూజీ వచానాలయ పరిరక్షణ సమితి సభ్యులు కోనేరు సాయికుమార్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో బాపూజీ వచనాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యలో ఆదివారం విలేకరలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాపూజీ వచనాలయ భూములు పది ఎకరాల స్థలంలో సాయిరెడ్డి పెట్రోల్ పంపు, పియల్ఎంయస్ పెట్రోల్ బంకు, కొన్ని దుకాణాలు కిరాయికి ఇవ్వబడ్డాయని తెలిపారు. నిజామాబాద్ పట్టణం పెరగడంతో జిల్లా కేంద్రం నడిఒడ్డున ఉన్న గ్రంథాలయ స్థలంపై కొంత మంది అవినీతి పరులు, కల్లు, సారా, లిక్కర్ కాంట్రాక్టర్ లు ఒక సిండికేట్ గా ఏర్పడి పాలకవర్గంలో చోటు సంపాదుంచుకున్నారని అన్నారు. వీరు గ్రంథాలయ భూములను కాజేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బాపూజీ వచనాలయ గత, ప్రస్తుత అధ్యక్షులు గ్రంథాలయాల భవనాలనకు కూల్చివేసి ముందుభాగంలో ఖాళీ స్థలం చేసి 60ఏళ్లుగా ఉన్న చిన్న దుకాణాదాలను తొలగించి పెద్ద ఎత్తున్న స్థలాన్ని కార్పొరేట్ సంస్థలకు అమ్ముకోవడానికి, తాకట్టు పెట్టడానికి కుట్ర చేస్తున్నారని అన్నారు. కల్లు, సారా, లిక్కర్ కాంట్రాక్టర్ లను భారి నుంచి బాపూజీ వచనాలయ స్థలాన్ని కాపాడి విద్యావంతులకు, నిరుపేదలకు, చదువుకోవడానికి ఉపయోగపడేటట్లు కాపాడాలని కోరారు.