Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 March 2025, 2:25 pm Posted by : ramakrishna

క్షయ వ్యాధి నిర్మూలనకు పాటుపడదాం

అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్

క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ

నిజామాబాద్, బతుకమ్మ : క్షయ వ్యాధి నిర్మూలనకు పాటుపడదామని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా టీ బీ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచి చేపట్టిన ఈ ర్యాలీని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. నర్సింగ్ విద్యార్థినులు, వైద్యాధికారులు, సిబ్బందితో కలిసి ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. టీబీ అంతం మనందరి పంతం..అని నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. క్షయ వ్యాధి నిర్మూలనకు చేపడుతున్న చర్యలను, వ్యాధి లక్షణాలు, పాటించాల్సిన జాగ్రత్తలు, చికిత్సా విధానాలను టీ బీ నియంత్రణ విభాగం అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ, డిప్యూటీ డీఎంహెచ్ వో తుకారాం, జిల్లా టీ బీ నియంత్రణ విభాగం కో ఆర్డినేటర్ రవిగౌడ్, నర్సింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థినులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.