నిజామాాబాద్, బతుకమ్మ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 126వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆదివారం సుభాష్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కంఠేశ్వర్ మండల బీజేపీ నాయకులతో కలిసి అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ వీక్షించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతూ పీఎం నరేంద్రమోదీ జాతిని ఉద్దేశించి గొప్ప సందేశంతో పాటు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారని పేర్కొన్నారు. దేశ ప్రజలందరు స్వదేశీ వస్తువులను ఉపయోగిస్తూ, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని మోదీ పిలుపునిచ్చారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా నినాదంతో ముందుకు సాగుతుందన్నారు. .భారతీయ మహిళలు తమ నారీ శక్తితో వివిధ రంగాలలో చూపిస్తున్నారన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఆర్ఎస్ఎస్ చేసిన సేవలను ప్రధాని గుర్తు చేశారని పేర్కొన్నారు. డా. కేశవ బలిరామ్ హెగ్డేవర్,గురూజీల స్ఫూర్తితో వారి ఆశయాలకు ఆకాంక్షాలకు అనుగుణంగా జాతీయ పునః నిర్మాణమే లక్ష్యంగా స్వయంసేవకులు పని చేయడం జరుగుతుందన్నారు.
