పహాల్గాంకు ప్రతీకారం తీర్చుకుందాం
నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిల్ల సాయరెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పాకిస్థాన్ ప్రేరిత ఉగ్రవాద దాడులకు సరైన గుణపాఠం చెప్పాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిల్ల సాయరెడ్డి అన్నారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పెహల్గాం లో హిందువులే లక్ష్యంగా నరమేధానికి పాల్పడిన ఉగ్రమూఖలకు ఉరితాడు వేయాలని డిమాండ్ చేశారు.పెహల్గాం ఉగ్రదాడి ని నిరసిస్తూ జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హల్ లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు.ఏళ్లతరబడి దేశంపై తెగబడుతున్న పాకిస్థాన్ ప్రోత్సాహక ఉగ్రవాదులు మట్టికర్వక తప్పదని సాయరెడ్డి...