నేర రహిత సమాజం కోసం కృషి చేద్దాం

. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: సమాజంలో అవినీతి అనే విషవృక్షాన్ని పెకిలించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ సునీత కుంచాల అన్నారు. దేశ అభివృద్ధికి అవినీతి అనేది ఒక అడ్డుగోడ అని, దానిని తొలగించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అవినీతి వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలను న్యాయమూర్తి అందజేశారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్...