Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 December 2024, 3:18 pm Posted by : ramakrishna

నేర రహిత సమాజం కోసం కృషి చేద్దాం

. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: సమాజంలో అవినీతి అనే విషవృక్షాన్ని పెకిలించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ సునీత కుంచాల అన్నారు. దేశ అభివృద్ధికి అవినీతి అనేది ఒక అడ్డుగోడ అని, దానిని తొలగించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అవినీతి వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలను న్యాయమూర్తి అందజేశారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి, అవినీతి నిరోధక శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

కాకతీయ ఒలంపియాడ్ విద్యార్థులు ఉమాశ్రీ, అక్షర, దుబ్బ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని అక్షర తదితరులు బహుమతులు అందుకున్నారు. అవినీతి నిరోధక శాఖకు సహకరించిన ఫిర్యాదుదారులు, బాధితులు జిమ్ శ్రీనివాస్ రెడ్డి, అరవింద్  సైతం కు ప్రశంసాపత్రాలు అందజేశారు.

Let's strive for a crime free society